సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వతంత్ర దినోత్స వ వేడుకల సందర్భంగా సీఎం జగన్ విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మువ్వన్నెల జెండా ఎగురవేసి పోలిసుల గౌరవ వందనం స్వీకరించి .. తదుపరి ఏపీ పోలీసులకు మెడల్స్ ప్రదానం చేసారు. ఈ సందర్భముగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభాబినందనలు తెలుపుతూ స్వతంత్ర పోరాటం లో అసువులు బాసిన ఈ ప్రాంత వీరులకు జోహార్లు అర్పించారు. వారి స్ఫూర్తి తన హయాంలో రాష్ట్రము అభివృద్ధి పధంలో పయనిస్తుందని .. తన హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టబడులు రూ. 67, 196 కోట్లు అని రాష్ట్రం లో కొత్తగా 127 భారీ పరిశ్రమల ఏర్పా టు చేస్తున్నామని అయితే ఇటీవల విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో రూ. 13. 42 లక్షల కోట్లకు ఎం వోయూలు రావడం వాటితో మన రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1 అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. కొత్తగా ప్రారంభమైన ఎం ఎస్ఎం ఈయూనిట్లు 2,00,995 అని.. 139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు చేశామని, శాశ్వత బీసీ కమిషన్ను నియమించిన తొలి రాష్ట్రం గా ఏపీ చరిత్ర సృష్టించిందన్నారు. తన హయాంలో 2 లక్షల 6 వేల 638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామన్నారు.వైద్య శాఖలో ఏకంగా 53, 126 పోస్టుల భర్తీ చేశామని , రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికలు కాలేజీలు నిర్మిస్తున్నాం అని, 108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాల కొనుగోలు చేశామని,రాష్ట్రం లో కొత్తగా 4 పోర్టుల నిర్మాణం ,భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు కొనసాగుతున్నాయి అన్నారు. దేశంలో ఆర్ధిక అభివృద్ధి దూసుకొని పోతున్న రాష్ట్రంగా మన ఏపీ .. కేంద్ర నివేదిక.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగామూడేళ్లు మనమే నంబర్ వన్ సాధించామన్నారు. నాడు-నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్పు చేశామని.. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ విద్య ప్రవేశపెట్టామని.. దీనిపై కొందరు నేతలు పేదలు ఇంగ్లీష్ మీడియాం చదువుకోవద్దని వాదించడం అంటరానితనమే.. పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితనమే.. అని విమర్శించారు. తాము ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని 98.5 శాతం అన్ని హామీలను అమలు చేశాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *