సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం,నియోజకవర్గంలో సీఎం డెవలప్మెంట్ నిధులు, గడపగడపకు నిధులతో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి స్థానిక క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ..నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. కరోనా రెండు సంవత్సరాలపాటు అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించిందని తెలిపారు. అయితే కరోనా అనంతరం అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. అదే మాదిరిగా నియోజకవర్గం అంతా సచివాలయం భవనాలను కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరిగిందని, పూర్తిచేసిన భవనాలలో సచివాలయ వ్యవస్థ పాలన ప్రారంభమైందని అన్నారు. మరికొన్ని చోట్ల భవన నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. ఈ సమీక్ష సమావేశంలో డి ఈ స్వామినాయుడు, జె ఇ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
