సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు,శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు,స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు ఘన స్వాగతం పలికారు. రఘురామా తో మర్యాద పూర్వక పలకరింపులు అనంతరం ప్రధాని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి పీఎం వెలగపూడికి చేరుకున్నారు. వెలగపూడిలో మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్వాగతం పలికారు. అక్కడ వేలకోట్ల రూపాయలతో నిర్మాణాలకు పలు నిర్మాణాలకు నూతన రోడ్లకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేసారు.
