సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన కేంద్ర మంత్రులు శ్రీనివాస వర్మ, బండి సంజయ్ నేతృత్వంలో ఏపీ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం విజయవాడలోని నోవోటేల్‌లో నేడు, ఆదివారం జరిగింది. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు కొందరు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కేడర్‌కు కీలక అంశాలపై అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందజేసే సాయాన్ని(వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు, పోలవరం ప్రాజెక్టు కు) ప్రజల్లోకి ఏపీకి బీజేపీ చేస్తున్న సాయంగా తీసుకొనివెళ్ళి పార్టీని మరింత ప్రజలకు దగ్గర చెయ్యాలని అమిత్ షా నిర్దేశ్యం చేసినట్లు సమాచారం. గత రాత్రి ఆయన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ తో సమావేశం అయిన విషయం విదితమే
