సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టణాల్లో ప్రజలకు స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం, కేంద్ర ప్రభుత్వ పధకం అమృత్ 2.0 పథకంలో మంజూరు అయిన రూ.286.54 కోట్లు ఖర్చు చేయనున్నారు. దానిలో భాగంగా జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం , నరసాపురం, తణుకు, ఆకివీడు పట్టణాల్లో కుళాయి కనెక్షన్లు ఇవ్వడం,పైపు లైన్ ల విస్తరణ, శుద్ధి చేసిన మురుగునీటిని రీసైకిల్ చేయడం (ఎస్టీపీల నిర్మా ణం ), అండర్ గ్రాండ్ డ్రైనేజీ అభివృద్ధి, తదితర పనులు చేపట్టనున్నారు. అలాగే జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెంలో మూడు చోట్ల ఎస్టీపీలు (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాం ట్లు) ఏర్పాటు చేస్తున్నారు. భీమవరం ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం , పైపులైన్లు, ఇంటింటికీ కుళాయిలు, 24 గం టల పాటు తాగునీటి సరఫరా తదితర పనుల కోసం రూ.47.29 కోట్లు నిధులతో పనులుచేపడతారు.తాడేపల్లిగూడెం పట్టణం లో రూ.100.20 కోట్లతో మరో ప్లాంట్ నిర్మించనున్నారు. నరసాపుర నీటి సరఫరా అభివృద్ధి పనులకు రూ.21 కోట్లు కేటాయించారు. ఆకివీడు నీటి సరఫరా అభివృ ద్ధి పనులకు రూ.5.29 కోట్లు, తణుకు జగనన్న కాలనీలో నీటి సరఫరా అభివృద్ధి పనులకు రూ.8.36 కోట్లు కేటాయించారు. వచ్చే ఆగస్టులో టెండర్లప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టనున్నారు.
