సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:నేడు, సోమవారం తాజగా అందిన సమాచారం ప్రకారం.. అమెరికాలో వాషింగ్టన్‌లో జరిగిన కారు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందినకొటికలపూడి కృష్ణ కిశోర్ (45), ఆశ (40) వాషింగ్టన్‌లో మరణించారు.వీరి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కృష్ణ కిశోర్ పదేళ్ల క్రితం నుంచి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. (accident US) వారి కుటుంబం అంతా అమెరికాలోనే నివసిస్తోంది. కృష్ణ కిశోర్ దంపతులు 10 రోజుల క్రితమే పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు. దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లారు. వీరి ప్రమాద వార్త తెలిసి పాలకొల్లులో వారి బంధువుల ఇంటా విషాద ఛాయలు కమ్ముకున్నాయి.
