సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచంలో ప్రస్తుతం అతి పెద్ద 4వ ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిన భారత దేశం ఆర్థిక వ్యవస్థను దిగజార్చడానికి, రష్యా తో మిత్ర బంధం తెంచడానికి అమెరికా అడ్జక్షుడు భారత్ ను తన మిత్ర దేశమం టూనే.. నేటి ఆగస్టు 1 నుండి 25శాతం సుంకం తో పాటు పెనాల్టీలు కూడా వేశారు. అయితే అమెరికా పన్నుల మోతకు అదే తీరున భారత్ ప్రతీకారం తీరుచుకొనే ఉద్దేశ్యం లేదని ఇరుదేశాల ప్రయోజనాలకు అనుగుణంగా జరిగే చర్చ ల్లో నిర్ణయాలు తీసుకుంటామని భారత్ విదేశాంగ శాఖ తాజగా పేర్కొంది. మౌనమే సరైన సమాధానమని, సమస్య ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరిస్తామని తెలిపాయి. అయితే ట్రంప్ పెద్ద వేస్తున్న పన్నులు భారత ఆర్థిక వ్య వస్థలోని కీలక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ తో అర్ధాంతరంగా భారత్ యుద్దమ్ ఆపేసిందంటే అది తాను చేసిన హెచ్చరిక వల్లే నని ట్రంప్ వందసార్లు అన్నా, పాక్ భారత్ ఫై అణు దాడి చేసి ఉండేదని, ఆ 3 రోజుల పాకిస్తాన్ ఫై భారత్ దాడులలో 5 యుద్ధ విమానాలు కూలిపోయాయి అని, ఇటీవల.. భారత్ ఎదో రోజు పాకిస్తాన్ వద్ద పెట్రోలు కొనుగోలు చేసే రోజు వస్తుందని అవమానకరంగా మాట్లాడుతున్నకూడా, ప్రధాని మోడీ ఏ కారణం చేతనో ట్రంప్ ఆరోపణలు డైరెక్ట్ గా ఖండించకపోవడం భారతీయులకు అర్ధం కావడం లేదు..
