సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ శాసనమండలిలో నేడు, మంగళవారం, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలను, పోలీసులు నిర్లక్ష్యాన్ని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. మహిళలపై దాడులకు సంబంధించి 1,485 కేసులు అధికారికంగా నమోదయ్యాయని, ఇంకా నమోదు కానివి ఎన్ని ఉన్నాయో?ప్రతి రోజు దారుణాలు జరుగుతూనేఉన్నాయని రోజుకు 4 నుంచి 5 చప్పున మహిళలు, చిన్నారి బాలికలపై సైతం అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పెరిగిన గంజాయి, డ్రగ్స్ వాడకం మత్తులో నేరాలు పెరుగుతున్నాయని.. చితూర్,మదనపల్లి వైజాగ్ వంటి వరుస ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయని చెప్పారు. హోమ్ మంత్రి అనిత సొంత విజయనగరం జిల్లా, సీఎం నియోజకవర్గంలో కూడా ఈ తరహా కేసులు బాగా పెరిగిపోయాయని అన్నారు. ఆడపిల్లలంటే ఎందుకింత వివక్ష?.. మత్తు పదార్థాల నివారణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని కల్యాణి ప్రశ్నించారు. అయితే ప్రస్నోత్తరాల సమయంలో ఇంత సుదీర్ఘ ప్రసంగాలు వద్దని మిగతా సబ్యులకు సమయం ఇవ్వాలని కళ్యాణి ని ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు వారించారు. అయితే.. కల్యాణి మాట్లాడుతుండగా..వైసీపీ సభ్యులు మాట్లాడుతుండగా మైక్ లు సరిగా పనిచెయ్యడం లేదని సభలో ఆడియో సరిగా రికార్డ్ అవలేదని బొత్స సత్యనారాయణ చెప్పగా.. ఏ సభ్యులు మాట్లాడినా రికార్డ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మండలి సిబ్బందిని ఛైర్మన్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *