సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చరిత్ర ప్రసిద్ధి పొందిన అయోధ్య ఆలయం పునఃస్థాపితమై రేపు సోమవారం ప్రధాని మోడీ సమక్షంలో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి వేలాది ప్రముఖులు తరలి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయోధ్య వెళుతున్నారు. నేటి ఆదివారం మధ్యాహ్నం అయోధ్యకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేసి.. సోమవారం రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరవుతారు. ఇద్దరు నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతుండడంతో.. పనిలోపనిగా అయోధ్యకు తరలి వస్తున్నా కేంద్ర బీజేపీ నేతలతో పొత్తులపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు కుదిరితే.. . ఇప్పటికే బీజేపీ కి రాష్ట్రంలో 5 లోక్ సభ సీట్లు.. 5 అసెంబ్లీ స్థానాలు చంద్రబాబు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలో చంద్రబాబు చేపట్టిన ‘రా కదలిరా’ కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి ఈనెల 27 లేదా 28 తేదీల్లో పత్తికొండలో ‘రా కదలిరా’ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *