సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తన ఇల్లు నిర్మించడానికి కొంత ఇరిగేషన్ స్థలం ఆక్రమించడానికి నీటిపారుదల శాఖ అధికారి సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపణ ఫై రాష్ట్రంలో జగన్ సర్కార్ పెట్టిన ఫోర్జరీ కేసు దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. నేడు, సోమవారం అయ్యన్న పై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ లో అయ్యన్నపై ఫోర్జరీ కేసు దర్యాప్తునకు అనుమతినిస్తూ జస్టిస్ ఎంఆర్ షా జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఫోర్జరీ సెక్షన్ల ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే ను సుప్రీం కొట్టివేసింది. అయ్యన్నపై రాష్ట్ర ప్రభుత్వం ఫోర్జరీ కేసు దర్యాప్తు సమయంలో హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది.
