సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గోదావరి జిల్లాల లో నదిలో ఈతకు వెళ్లి 2 రోజుల వ్యవధిలో ముమ్ముడివరం, ఆచంట ప్రాంతాలలో 12 మంది యువకులు మరణించిన విషాదాలు మరచిపోకముందే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. నేడు, ఆదివారం అల్లూరి జిల్లా అరకు లోయలోని ఏజెన్సీ ప్రాంతంలోని వేసవి సెలవులు కావడంతో .. డుంబ్రిగూడ మండలం గుంటసీమ దగ్గర కొంతమంది బాలురు ఈతకు వెళ్లారు. అయితే చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండటం, లోతు కూడా ఉండటంతో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగి చనిపోయారు. ఈ విషాద సంఘటనతో నలుగురు మృతి చెందినట్లు తాజా సమాచారం. నాలుగు కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి
