సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వర్షాకాలంలో వర్షం కోసం ఎదురుచూడవల్సిన పరిస్థితి వచ్చింది. గ్యాంగెటిక్ పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలలో ఏర్పడిన సుస్పష్టమైన ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని ,దీని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
