సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో అల్పపీడనం, ప్రభావంతో ఏపీలో రాయలసీమ, నెల్లూరు గుంటూరు, కృష్ణ, గోదావరి జిల్లాలలో (మొత్తం 14 జిల్లాలులో} వర్షాలు పడనున్నాయి. . నేడు, బుధవారం కాస్త వాతావరణం చెల్లబడింది. దీనికి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణే కారణం. ఈ ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. రేపటి నుంచి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నెల్లూరు జిల్లా కొండాపురంలో నిన్న మంగళవారం భారీ వర్షం దంచికొట్టింది. సాయంత్రం వరకు అత్యధికంగా 39.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడే కాదు ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 34.4 మిల్లీమీటర్లు, కావలిలో 34.2, మారెళ్లలో 33.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని ప్రఖర్ జైన్ తెలియజేశారు
