సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసలే తీవ్ర ఆర్ధిక సంక్షోభం లో ప్రజలకు తినడానికి సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ లో గత మంగళవారం మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను, ఆయన సన్నిహితుల వరుస అరెస్టులతో పాకిస్తాన్ ఉద్రికతలతో ఆందోళనలతో దహానాలతో అల్లకల్లోలం గా మారిపోయింది. దీనితో ఇమ్రాన్ ఖాన్ ను సైనిక దళాలు అరెస్టు చేసిన తీరుపై పాక్ సుప్రీం కోర్టు తాజగా నేడు, గురువారం తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేసింది. రిజిస్ట్రార్ అనుమతి లేకుండా కోర్టు ప్రాంగణం లోకి ప్రవేశించి ఆయన్ను అరెస్టు చేయడం అన్నది పూర్తిగా కోర్టు ధిక్కరణే అని అభివర్ణించిన సుప్రీం కోర్టు.. ఇమ్రాన్ ఖాన్ ను గంటలోగా న్యాయస్థానం ముం దు ప్రవేశపెట్టాలని జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్ఏబీ)ను ఆదేశించింది. తనను హత్య చెయ్యడానికి కుట్ర జరుగుతుందని ఇమ్రాన్ ఖాన్ మీడియా ముందు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఓ కేసు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చి న ఆయనను.. పాక్ సైన్యం చుట్టుముట్టి అడ్డుకొన్న లాయర్లు ఫై దాడికి దిగి బలవంతం గా ఇమ్రాన్ ను లాక్కెళ్లిన దృ శ్యా లు మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *