సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్లరి నరేష్ సినిమా అంటే ఒకప్పుడు కామెడీ చిత్రాలే.. కానీ గత 6ఏళ్లుగా ట్రెండ్ మార్చాడు వరుసగా మహర్షి నుండి నా సామీ రంగా వరకు సీరియస్ పాత్రలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అల్లరి నరేష్ బచ్చల మల్లి అంటూ పూర్తిగా డిఫరెంట్ పాత్ర లో సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ బచ్చల మల్లి ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? ముందు కధ విషయానికి వస్తే.. 1980-2005 దశకం మధ్య తుని గ్రామంలో కధ ను పిట్ చేసారు. బచ్చల మల్లి (అల్లరి నరేష్) తన తండ్రి సత్య నారాయణ (బలగం జయరామ్) రెండో కాపురం పెట్టాడన్న కోపంతో మూర్ఖుడిగా మారిపోతాడు. అప్పటి వరకు గొప్పగా చదివిన మల్లి ఆ తరువాత చదువు జోలికి కూడా వెళ్లడు. చెడు తిరుగుళ్లు, చెడు సావాలతో నాశనం అవుతుంటాడు. మల్లి. తినడం, తాగడం, పనికి వెళ్లడం, అడ్డొచ్చిన వాళ్లని తన్నుకుంటూ వెళ్లడం. ఇదే మల్లిగాడి దినచర్య. అలాంటి మల్లి జీవితంలోకి కావేరి (అమృతా అయ్యర్) వస్తుంది. ఆమె రాకతో మల్లి కూసింత మారేందుకు ప్రయత్నిస్తాడు. మారుతాడు కూడా. కానీ మళ్లీ మల్లిగాడి జీవితం మొదటికే వస్తుంది. తాగుడుకే అలవాటు పడతాడు. గాడిలో పడ్డ జీవితాన్ని మళ్లీ ఏట్లోకి తోసేసుకుంటాడు. అసలు మల్లి జీవితంలోకి వచ్చిన కావేరి ఏం అవుతుంది? మల్లి జీవితంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీ నారాయణ (రావు రమేష్), గణపతి రాజు (అచ్యుత్ కుమార్) పాత్ర ఏంటి? అన్నది కథ. జీవితం అంతా చేజారిపోయిన తరువాత, అందరినీ కోల్పోయిన తరువాత గానీ తత్త్వం బోధపడదు. ఇదే పాయింట్‌ను బచ్చల మల్లి కథతో దర్శకుడు సుబ్బు చెప్పదల్చుకున్నాడు. ఆస్పత్రిలో రోహిణి మాటలు, ఆ మాటలు విని మల్లిని ఆలోచనలో పెట్టిన సన్నివేశాలు హృద్యంగా సాగాయి . జీవితం అన్నాక పట్టూ విడుపులు ఉండాలని రాసిన డైలాగ్ బాగుంటుంది. గుండె కూడా మన రక్తాన్ని పట్టుకుంటుంది.. విడుస్తుంది.. అలా చేయకపోతే మనం చనిపోతాం.. జీవితంలో కూడా అలానే పట్టూ విడుపులు ఉండాలని చెప్పే సీన్ కనువిప్పులా ఉంటుంది.అయితే బచ్చల మల్లి కథలో చాలా చోట్ల కొత్తదనం కనిపించదు. ఫస్ట్ హాఫ్ మొత్తం సాదాసీదాగా సాగుతుంది. అల్లరి నరేష్ పాత్రను మల్చిన తీరు, కసిగా నటించిన తీరు బాగుంది. ఆయన సినీ జీవితంలో గుర్తుంచుకునే పాత్ర ఇది. ఇక జాతర సీన్‌లో ఫైటింగ్, తారాజువ్వలు వచ్చే షాట్స్ మాత్రం అదుర్స్… క్లైమాక్స్‌ సన్నివేశాలను కాస్త బలంగా రాసుకున్నాడు దర్శకుడు. మొత్తానికి బచ్చల మల్లి కి పాస్ మార్కులు వెయ్యవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *