సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్ని వివాదాలు ఎదురయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప గాడు తగ్గేదేలే .. అంటూ పుష్ప 2 తో కేవలం 6 రోజులలో 1000 కోట్లు సాధించిన తోలి తెలుగు పాన్ ఇండియా సినిమాగా చరిత్ర సృష్టించడం దేశ విదేశాలలో పుష్ప 2 కు బ్రహ్మరధం పడుతుండటం ఒక ఎత్తయితే.. అతనిని తెలుగు నేల హైదరాబాద్ లో వివాదాస్వాద కేసులో అరెస్టు చేసి జైలు కు తరలించడం తదుపరి హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఊరట నివ్వడం పెద్ద హైలైట్ గా దిష్టి పోయిందని అల్లు అభిమానులు భావిస్తున్నారు. అయితే పుష్ప2 విజయాన్ని ఆస్వాదిస్తూ మెగా హీరోలలో ఎవరు ఇప్పటి వరకు ఎవరు మాట్లాడక పోవడం వారి మధ్య పెరిగిన దూరాన్ని సూచిస్తుంది. అయితే నేటి మధ్యాహ్నం అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్ట్ 14 రోజులు పోలీస్ రిమాండ్ విధించడంతో అతనిని చెంచల్ గూడా జైలుకు తరలిస్తున్న వేళా.. ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు అల్లు అర్జున్ కుటుంబాన్ని ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, నటుడు నాగబాబు.. బన్నీ ఇంటికి చేరుకుని అల్లు అరవింద్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అల్లు అర్జున్ ఇంటికి పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్, హీరో దగ్గుబాటి రాణా చేరుకున్నారు. మరి కొద్దీ సేపటిలో ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అల్లు అరవింద్ ఇంటికి వస్తున్నట్లు? సమాచారం.
