సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో మండల తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. నేటి ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆయన తనకు టిఫిన్ పట్టుకొనిరమ్మని అటెం డర్ ను బయటకు పంపారు. . తదుపరి టిఫిన్ తో అటెండర్ తిరిగి కార్యాలయానికి వెళ్లే సరికి పక్కనే ఉన్న ఓ షెడ్లో శ్రీనివాసరావు ఉరివేసుకుని మృతిచెందడాన్ని గుర్తించారు. ఇటీవల పాడేరు కలెక్టరేట్లో జరిగిన సమావేశానికి తహసీల్దార్ శ్రీనివాసరావు వెళ్లారు. ఈ సమావేశం లో భూముల రీసర్వే విషయం లో ఉన్నతాధికారులు ఆయనపై ఆగ్రహం వ్య క్తం చేసినట్లు సమాచారం. అయితే మరణానికి అసలు కారణం దర్యాప్తులో తెలవలసి ఉంది.
