సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నా అవతార్2’ టికెట్ బుక్సిం గ్స్ భారత దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యా యి. డిసెంబరు 16న విడుదల అవుతున్న ‘అవతార్2’ను భారతదేశ వ్యాప్తంగా ఇంగ్లీష్ , హిందీ, తెలుగుతో సహా, ఏడు భాషల్లో విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్స్ , యాప్లు ప్రధాన నగరాల్లోని థియేటర్స్ బుకింగ్స్ ను అందుబాటులోకి తెచ్చాయి. ‘అవతార్2’ (Avatar: The Way of Water)ను ఐమ్యా క్స్ 3డీ, 4డీఎక్స్ 3డీ ఫార్మా ట్లలోనూ విడుదల చేస్తుండటంతో ఆ భారీ స్క్రీ న్ల పైనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి ని డబ్బు చేసుకోవడనికి పంపిణీదారులు పెద్ద ఎత్తులు వేశారు. అయితే సినిమా టికెట్ రేట్లపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఏపీలో ఆ పప్పులు ఉడకవు మరి.. ఇతర రాష్ట్రాలలో ఫార్మా ట్ కలిగిన స్క్రీ న్ల టికెట్ ధరలు చూస్తే గుండెలు గుభేల్ మంటాయి. కొన్ని ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్ లో బెంగళూరులోని ఐమ్యాక్స్ 3డీ ఫార్మా ట్ కలిగిన థియేటర్లో టికెట్ ధర ఏకం గా రూ.1,450 చూపిస్తోంది. అలాగే పుణెలో రూ.1200 (4డీఎక్స్ 3డీ), ఢిల్లీ లో ఎన్సీఆర్లో రూ.1000గా ఉంది. ముంబయిలో రూ.970, హైదరాబాద్లో ఒక్కో టికెట్ ధర రూ.350 (4డీఎక్స్ 3డీ ఫార్మా ట్) విశాఖ రూ.210 (3డీ ఫార్మా ట్) ఉం ది. ఈ ధరలన్నీ సాధారణ సీట్స్ కు సం బం ధిం చినవి. వీటికి పన్నులు, ఇంటర్నెట్ ఛార్జీలు అదనం..
