సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ ; నేడు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవంగా అవతరణ దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 10.15 గంటలకు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి .. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రము కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మబలిదానం చరిత్ర మరువదని ఘన నివాళ్లు అర్పించారు. అనంతరం సీఎం జగన్‌ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌కు వెళ్లి అక్కడ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎస్‌పీలు సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలలో . తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *