సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలతో ఇటీవల వర్షం దోబూచులాడుతోంది. ఆకాశంలో అతిభారీ వర్షం కురిసేలా మబ్బులు కనిపిస్తున్నాయి.వాతావరణం చల్లబడుతుంది కానీ చిరుజల్లులు కురిశాక మబ్బులు మాయమైపోతున్నాయి. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవల అల్పపీడనం వల్ల , నైరుతి రుతుపవనాల వేగం పెరిగిందని వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. . నైరుతి గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో నేటి బుధవారం నుండి వచ్చే ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *