సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో 14 రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు అంతా సిద్ధమైంది. అందులో భాగంగా జూలై 1న ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్ష ఎంపికకు రంగం సిద్ధం అయ్యింది. అసలే ఏపీలో కూటమి ప్రభుత్వం లో బీజేపీ పాత్ర ఎంతటి కీలకమైనదో అందరికి తెలిసిందే.. మరి ఈసారి కూడా పురంధేశ్వరినే కంటిన్యూ చేస్తారా? లేక కొత్త నేతకు అవకాశం ఇస్తారా? అన్నది. ఈసారి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో మంచి కార్యనిర్వాహణ దక్షత ఉన్న నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, జయప్రకాశ్ నారాయణ్ వంటి నేతల పేర్లు అధ్యక్ష రేసులో వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం టీడీపీ జనసేనలో కలసి కూటమి పాలన నేపథ్యంలో అదే పట్టు కొనసాగించడానికి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరికి మరోసారి అవకాశం కొనసాగిస్తేనే మంచిది అన్న ప్రతిపాదన కూడా పార్టీ అధిష్టానంలో చర్చకు వచ్చిందట…మరో 2 రోజులు వేచి చూడాలి
