సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి అందరు ఎదురుచుస్తునట్లే రైల్వే శాఖ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కు కేంద్ర రైల్వే శాఖ నుంచి నేడు, శుక్రవారం వర్తమానం వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును (గంటకు 165 కి.మీ. వేగంతో ప్రయాణిం చడం తోపాటు 1,129 సీటిం గ్ సామర్థ్యం కలిగినది ) 2023 జనవరి నెలలో బహుశా 2వ వారం నుండి తెలుగువారి సంక్రాంతి కానుకగా సికిం ద్రాబాద్ నుండి విజయవాడ మధ్య నడపాలని భావిస్తున్నారు. త్వ రలోనే అధికారికంగా తేదీ ప్రకటిస్తారు. తరువాత దీనినే కొద్దీ రోజుల తరువాత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మీదుగా విశాఖపట్నం వరకు పొడిగిస్తారు. ఈ సంక్రాంతి కి పశ్చిమ గోదావరి మీదుగా రైలు వచ్చేస్తుందని ఆశపడిన వారికీ కొంత నిరాశ తప్పదు.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెం డో వందేభారత్ ఎక్స్ ప్రెస్ను సికిం ద్రాబాద్–తిరుపతి మధ్య నడపనున్నారు. ఈ రైలును సికిం ద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరుపతి వరకు నడుపుతారు. ఇంకా రూటు కాలేదని సమాచారం.
