సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష జరుగుతుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ప్రిన్సిపాల్ లాగిన్ ద్వారా హాల్ టిక్కెట్లు పొందాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షల సమస్యలపై విద్యార్థులు వారి తల్లితండ్రులు కోసం ట్రోల్ ఫ్రీ నం: 1800 4257635 ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 1,489 కేంద్రాల్లో 10,03,990 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
