సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు గనుల భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ నేడు, బుధవారం ఆకివీడు రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ లోని పలు సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు. రైల్వే స్టేషన్లో లిఫ్ట్ నిర్మాణ పనులు సగంలోనే ఆగిపోవడంతో ఉన్నతాధికారుల నుంచి మంత్రి, వివరాలు సేకరించారు. పెండింగ్ పనులను త్వరితంగా పూర్తీ చేయిస్తానని హామీ ఇచ్చారు. తదుపరి ఆకివీడులో జరిగిన నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకల్లో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తో పాటు స్థానిక ఎమ్మెల్యే , అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్థానిక బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆయన కూడా స్వయంగా రక్తదానం చేశారు. భారీ కేక్ కట్ చేసి నరేంద్ర మోడీకి ఆయన దేశానికీ, మన ప్రాంతానికి చేస్తున్న సేవలు ప్రశంసిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
