సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై నేటి బుధవారం మధ్యాహ్నం టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీకొట్టి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్ లోనే మృతి చెందారు. టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో అందులోని గుర్తుపట్టలేని విధంగా నుజ్జు నుజ్జు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. టిప్పర్ కింద నుంచి మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు. మృతిచెందిన వారిలో ఒక చిన్నారి కూడా ఉండడం ఎంతో విషాదకరం.
