సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లలో పట్టణ నిర్మాణాల అభివృద్ధి లో మినీ భీమవరం ను తలపించే ఆకివీడు నగర పంచాయతీలో గత గురువారం సాయంత్రం పట్టణ TPO అధికారి పి.రాధాకృష్ణ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన జరిగిన ఘటన సంచలనం కలిగించింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆకివీడు లో గత కౌన్సిల్ సమావేశంలోనూ నాన్ లే అవుట్ స్థలాలు ఎక్కువయ్యాయని దీనితో కౌన్సిల్ కు రావలసిన ఆదాయం రావడం లేదని, చర్యలు తీసుకోవాలని స్థానిక కౌన్సిలర్లు మునిసిపల్ అధికారులను కమిషనర్ కృష్ణమోహన్‌కు ఫిర్యాదులు చేస్తూ నిలదీశారు. ఈ నేపథ్యంలో.. టౌన్ లో ఎన్నో ప్లాన్‌లు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఒక్క సహాయకుడు కూడా లేకుండా పని ఒత్తిడిలో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీ వో) పి.రాధాకృష్ణ తనను సంజాయిషీ కోరిన కమిషనర్‌తో గత సాయంత్రం వాగ్వాదానికి దిగి, తననే ఎందుకు బాద్యుడిని చేస్తున్నారని, తదుపరి అసహనంతో కొద్దీ సేపటికే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి విఫల యత్నం చెయ్యడం అక్కడ ఉన్న ఇతర సిబ్బంది వెంటనే ఆయనను అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. నగర పంచాయతీ కార్యాలయం బయట కలకలం రేగడంతో వీడి యో కాన్ఫరెన్స్‌లో ఉన్న కమిషనర్ బయటకు వచ్చి రాధాకృష్ణను సముదాయించి అదనపు సిబ్బంది నియామకం కోసం పైఅధికారులను అడుగుతానని భరోసా ఇచ్చారు.
