సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మీడియా సమావేశంలో చేసిన వివాదాస్వాద వాక్యాలు అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు నుద్దేశించి చేసినవేనని కొన్ని మీడియా ఛానెల్స్ లో ప్రచారం అవుతున్న నేపథ్యంలో.. నేడు, బుధవారం ఆకివీడులో కేంద్ర మంత్రి వర్మ పర్యటనలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు జరిగిన ప్రధాని మోడీ మరియు విశ్వకర్మ జయంతి వేడుకలలో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సంయుక్తంగా పాల్గొనడం , బర్తడే కేక్ ను వర్మ కట్ చేసి రఘురామా కు తినిపించడం కూటమి నేతలను ఉత్తేజపరచింది. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీ చైర్మన్, మంతెన రామరాజు కూడా పాల్గొన్నారు. నైపుణ్యం కలిగిన చేతి వృత్తులకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా 13 వేల కోట్ల ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విశ్వ కర్మ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17న శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నదని, ఈ సందర్భంగా శిల్పకారులను, కళాకారులను గౌరవించుకోవాలన్నారు. వీరి శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఆర్ధిక సహాయం మౌలిక వసతులు అందజేయడం ద్వారా భరోసా కల్పిస్తోందన్నారు.
