సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో బాగంగా గణపవరం సమీపంలోని నారాయణపురం నుండి జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటన ప్రారంభించారు, ఆయనకు భీమవరం, తణుకు, ఆచంట టీపీ గూడెం నుండి వచ్చిన జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు, ఈ సందర్భముగా నాదెండ్ల మనోహర్ ఇటీవల ఆకివీడు మండలం కుప్పంపూడిలో ఇటీవల విద్యుత్ షాక్ తో మృతి చెందిన గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త పులపాకుల శ్రీమన్నారాయణ కుటుంబాన్ని పరామర్శించి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు, ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని పని జనసేన చేస్తోంది. క్రియాశీల కార్యకర్తలకు ఏదైనా జరిగితే వారి కుటుంబాలకు అండగా ఉంటుంది.తుపాను వర్షలతో రైతులకు నష్టం జరిగితే క్షేత్ర స్థాయిలో ఎక్కడా ముఖ్యమంత్రి పర్యటించడం లేదు. రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయింది. ధాన్యం కొనుగోళ్లలో తేమ శాతం ఎంతున్నా కోనుగోలు చేయాలి, రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి అని డిమాండ్ చేసారు.
