సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3 రోజులుగా భీమవరం పట్టణ శివారులోని పెద్దమిరం లోని రాధాకృష్ణన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆక్వా ఎగ్జిబిషన్ కార్యక్రమంలో నేడు, శనివారం ఉదయం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని వివిధ రకాల స్టాల్స్ సందర్శించారు. ఈ expo ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రాంత రైతులకు పరిచయం చేస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.
