సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సికింద్రాబాద్ తాజగా ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 434 పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.వీటిలో అత్యధికంగా నర్సింగ్‌ సూపరింటెండెంట్‌: 272 పోస్టులు, ఫార్మసిస్ట్‌ (ఎంట్రీ గ్రేడ్) 105 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆర్‌ఆర్‌బీ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా సబ్మిట్ చేయవచ్చు.అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో BSC నర్సింగ్, BSC, డిప్లొమా, 10+2 లేదా ఫార్మసి, రేడియోగ్రఫిలో డిప్లొమా, డిగ్రీ, DMLTలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.పోస్టును బట్టి కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి గరిష్ట వయస్సు 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.నర్సింగ్‌ సూపరింటెండెంట్‌: రూ.44,900 ఇక మిగతా పోస్టులకు 35 వేలు నుండి 22వేలు వరకు జీతభత్యాలు అదనపు అలవెన్సులు ఉంటాయి. ఆన్‌లైన్ లో సెప్టెంబర్‌ 18, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *