సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ , ప్రభాస్‌ అభిమానులు ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్‌’ ట్రైలర్‌ నేడు, మంగళవారం మద్యాహ్నం 2గంటలకు సమయంలో రిలీజ్ చేసారు. నిజానికి . సాయంత్రం 5.04 నిమిషాలకు ట్రైలర్‌ విడుదల అని చిత్ర బృందం ప్రకటించినప్పటికి కొన్ని గంటల ముందుగానే విడుదల చేసారు. భీమవరం విజయలక్ష్మి, మహాలక్ష్మి థియేటర్స్ లో నేటి సాయంత్రం 5గంటల నుండి అభిమానులకు 3డి లో ట్రైలర్ ను పలు ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. గత అనుభవాల దృష్ట్యా పలు అనుమానాల మధ్య ట్రైలర్ చుసిన ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయింది. నిజంగా క్వాలిటీ, సినిమా గ్రాఫిక్ విజువల్స్ , డైలాగ్స్ , అదిరిపోయాయి. ఈ సారి నటీనటులు కార్టూన్ లాగా కాకుండా సహజంగా కనిపించారు. ప్రతి డైలాగ్‌లోనూ శ్రీ రామచంద్రునిపై హనుమంతుడి భక్తి కనిపిస్తోంది. ‘మీకు వదినమ్మ ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రియమైనదా? అని లక్ష్మణుడు అనగా.. నా ప్రాణమే జానకీలో ఉంది. కానీ ఆ ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రియమైనది’ అని చెప్పడంతో మరాద్య, రాజ్య ప్రతిష్ట కోసం రాముడు ఎంతగా ఆలోచిస్తాడో తెలుస్తోంది.‘నా కోసం పోరాటం చేయవద్దు.. వేల సంవత్సరాల తర్వాత తల్లుల ఈ వీర గాథల్ని చెబుతూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి, అయితే దూకండి ముందుకు… అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి’ అన్నడైలాగ్స్, జై శ్రీరామ్ పాటలు రోమాలు నిక్కబోడిచేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ ప్రతి నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రభాస్‌ రాముడిగా, కృతీసనన్‌ జానకిగా నటించిన ఈ చిత్రానికి ఓంరౌత్‌ దర్శకుడు. T Series పతాకంపై భూషన్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *