సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలన సినిమాగా చరిత్ర సృష్టించిన తెలుగు మూవీ ‘ఆర్ఆర్ఆర్’ టీంకి మరో అరుదైన ఘనత దక్కింది. ఎం.ఎం. కీరవాణీ సంగీత దర్శకత్వం అందించిన ‘నాటు నాటు’ తెలుగు సాంగ్‌ని సినిమాలో కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడిన విషయం తెలిసిందే. మార్చి 12న జరగనున్న ఆస్కార్స్ 2023 స్టేజ్‌పై ఈ సింగర్స్ ఇద్దరూ ఈ పాటని పాడే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆస్కార్ యాజమాన్యం ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ని షేర్ చేసింది.అందులో.. ‘‘95వ ఆస్కార్స్ స్టేజ్‌పై రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ్ ‘నాటు నాటు’ పాటని పాడనున్నారు’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనితో పలువురు విదేశీ అభిమానులు సైతం ‘మాకు ఆ హీరోలతో కలసి స్టేజ్‌పై డ్యాన్స్ చేయాలని ఉంది. ఒక్క అవకాశం ప్లీజ్’ అంటూ కామెంట్స్ చేయడం విశేషం.
