సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండి బీచ్‌లో డిసెంబర్ 14న మారణకాండ లో 16 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. యూదులను లక్ష్యంగా చేసుకుని తండ్రీకొడుకులు సాజిద్ అక్రమ్ (50), నవీద్ అక్రమ్ (24) కాల్పులు జరిపారు. సాజిద్ ఘటనా స్థలంలోనే పోలీసుల కాల్పుల్లో మరణించగా, నవీద్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.వీరిని మొదట పాకిస్తానీయులు గా భావించినప్పటికీ తదుపరి పోలీస్ విచారణలో సాజిద్ అక్రమ్ మన ‘తెలంగాణలో’ని హైదరాబాద్‌కు చెందినవాడు కావడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని అతడి బంధువులు షాక్‌కు గురయ్యారు. 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత యూరోపియన్ సంతతికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. నవీద్ ఆస్ట్రేలియాలోనే జన్మించిన పౌరుడు. వారి కారులో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్‌లు, హోమ్‌మేడ్ ISIS జెండాలు లభ్యమయ్యాయి. దాడి ISIS భావజాలం ప్రేరేపితమని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *