సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:మరోసారి బంగారం, వెండి ధరల పెరుగుదల మరోసారి మొదలైంది. గత మంగళవారం కాస్తంత తగ్గినట్టు అనిపించిన బంగారం, వెండి ధరలు నేడు, బుధవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే ఊపందుకున్నాయి. దానితో పాటు వెండి ధర కూడా ఊహించని స్థాయిలోకేజీకి వచ్చి ఒక్కసారిగా 9 వేలు పెరిగి రూ.2,08,000కు చేరుకోవడం అందరిని నివ్వెరపరచింది. నేడు బుధవారం ఉదయం 11.00 గంటలకు భారత్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,510కు చేరుకుంది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.650 ఎక్కువ. ఇక 22 క్యారెట్ బంగారం ధర కూడా రూ.600 మేర పెరిగి 1,23,300కు చేరుకుంది.
