సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ లో ఉంటున్న పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లాలనే గడువు నేటి సోమవారం తో ముగుస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం తాజగా మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఇంకా ఎవరైనా పాకిస్తాన్ పౌరులు దేశం వీడకపోతే వారిని జైలుకి పంపిస్తామని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు 3 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామంది. ఏప్రిల్ 4న అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ యాక్ట్ 2025 ప్రకారం.. గడువు ముగిశాక భారత్ లో ఉన్న పాక్ పౌరులకు మూడేళ్ల జైలు లేదా 3 లక్షలు జరినిమా.. లేదా రెండూ విధించే అవకాశం ఉంది. భారత్ లోని ఆసుపత్రులలో చికిత్సలు పొందుతున్న.. మెడికల్ వీసాల మీద ఉన్న పాకిస్తాన్ పౌరులు రేపు ఏప్రిల్ 29వ తేదీకల్లా భారత దేశం విడిచి వెళ్లాలి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల పోలీసులు చేస్తున్న గాలింపులో పాకిస్తాన్ వాళ్ళ కన్నా దేశం నలుమూలల బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో పోలీసులకు చిక్కుతుండటం విశేషం.
