సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో నగరాలు, పట్టణాలతో పాటుగా గ్రామాల్లోనూ ఇంటింటికీ హైస్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ అందించేందుకు రేవంత్ సర్కార్ కార్యాచరణ మెుదలు పెట్టింది. రాష్ట్రంలోని మెుత్తం 33 జిల్లాలను 10 జోన్లుగా విడగొట్టి టీ ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రవేటు సంస్థల ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు ఫ్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆయా సంస్థల నుంచి అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ముందుగా 3 నెలల పాటు ఇంటర్నెట్, టీవీ ప్రసారాలు ఉచితంగా అందించనున్నారు. ఆ తర్వాత అతి తక్కువ ధరలకే ఈ సేవల్ని అందించేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు. అందుకు అధికారులు కార్యచరణ మెుదలుపెట్టారు. 3 నెలల తర్వాత ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ- ఎడ్యుకేషన్ సేవలను రూ.300 అందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో సమావేశమయ్య టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ -3లో చేర్చాలని సీఎం కేంద్రమంత్రిని కోరారు
