సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీహార్ రాజకీయాలు మరో సారి సీఎం నితీష్ వల్ల వేడెక్కిపోయాయి. శాసన సభలో తక్కువ స్థానాలు గెలిచినప్పటికీ తన చాణక్యత తో ప్రజలు తీర్పు ఎలా ఉన్న తాను సీఎం అవ్వడం కోసం తన పదవి భద్రతా కోసం ఏ పార్టీతోనైనా, లేక ఏ మిత్ర పార్టీతో నైనా ఒక్కసారిగా తెగతెంపులు చేసుకొనే జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తాజగా బీజేడీ మద్దతుతో కొనసాగుతున్న నేపథ్యంలో వారితో విభేదించి తాజగా తన సీఎం పదవికి రాజీనామాచేశారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఈ పరిణామంతో విపక్షాల ఇండియా కూటమికి ఆయన గుడ్‌బై చెప్పినట్లైంది. మరోసారి గతంలో బీజేపీ ని వదిలేసిన మరల వారి సాయంతోనే జేడీయూ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నితీశ్ భావిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తదితర అగ్రనేతలు తో చర్చలు జరుపుతున్నారు. కేంద్రంలో సోనియా గాంధీ మరోసారి చక్రం త్రిప్పుదామని ఏర్పాటు చేసిన ఇండియా కూటమి నుండి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ వైదొలగటం ఆ కూటమికి పెద్ద దెబ్బె..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *