సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వాలంటీర్లపై పవన్ కల్యా ణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు సీఎం జగన్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు, వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధుల జమ కార్యక్రమం లో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేస్తున్న వ్యవస్థలను, మంచి చేసే మనుషులనూ సంస్కారం ఉన్న ఎవరూ దూషించారని అయితే ఇటీవల కొందరు వ్యక్తిగత క్యారెక్టర్ లేనివారు చేస్తున్న విష ప్రచారానికి ఎంత వద్దనుకున్నా మాట్లాడవలసి వస్తుందని… చంద్రబాబు వద్ద 10 ఏళ్లుగా వాలంటీరుగా పనిచేస్తున్న ప్యాకేజి స్టార్ దత్త పుత్రుడు ఇటీవల నిసిగ్గుగా వాళ్ళు ఒంటరి మహిళలను మిస్సింగ్ చేసే శక్తులకు సహకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసారని రాష్ట్రంలో 2న్నర లక్షల వలంటీర్ల ను అవమానించారని, మహిళావలంటీర్స్ అందరు నా చెల్లెళ్ళు అని… వారిని విమర్శించిన దత్తపుత్రుడు క్యారెక్టర్… ఒంటరి యువతులను లోబరుచుకోవడం , ప్రతి 4 ఏళ్లకు ఒక పెళ్లి చేసుకోవడం, వారిని వదిలెయ్యడం మరో పెళ్లి చేసుకోవడం,ఇంకా యువతులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇదే అతని క్యారెక్టర్ . ఈయన కూడా మహిళలు రక్షణ గూర్చి మాట్లాడతారు, ఇక 75 ఏళ్ళ ముసలాయన ఒక టివి షో లో అమ్మాయిల విషయంలో ‘బావ మీరు సినిమాలలో చేశారు, నేను కూడా ఆ వయస్సులో ఎన్నో చేసేసాను.అని సిగ్గులేకుండా అంటాడు .ఇక అతని సొంత పుత్రుడు పట్టపగలు తాగేసి 10 మంది అమ్మాయిలతో అసభ్యకర వేసిన చిందులు ఏ యూ ట్యూబు లో అయినా చూడవచ్చు, ఇక ముసలాయన బావమరిది ‘అమ్మాయిలు కనిపిస్తే ముద్దయిన పెట్టాలి లేదా కడుపు అయిన చేస్తా ‘అని ఆ దౌర్భాగ్యుడు పబ్లిక్ గా అంటాడు ఇటువంటి క్యారెక్టర్ లేని వ్యక్తులా? వాలంటీర్లు వంటి సేవాభావం ఉన్న మన పిల్లలను ఆరోపించేది? అని సీఎం జగన్,తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.
