సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కారణాలు ఏవైనా విచిత్రంగా ఏపీలో వరుసగా నీటిలో గల్లంతు అయిన మృతి చెందిన కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి .తాజగా కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతి కారణంగా..సాన్నలకు వెళ్లిన ఇద్దరు యువకుల గల్లంతుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువకుల గల్లంతుపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా కోనసీమ జిల్లాకు సంబంధించిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3వ తేదీన సముద్రంలోకి వేటకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, 21 రోజులు దాటినా వారి ఆచూకీ ఇంకా కానరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ దీనిపై కూడా అధికారులను ఆదేశించారు.
