సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి వైఎస్సా ర్సీపీ ఎంపీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు, శుక్రవారం ఉదయం తాడేపల్లిలో లోని తన కార్యాలయంలో ఈ భేటీ నిర్వహించారు. పార్లమెంటరీ నేతగా వైవి సుబ్బారెడ్డి, లోక్ సభ నేతగా మిదున్ రెడ్డి, రాజ్యసభ నేతగా విజయసాయి రెడ్డి ని నియమిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు జగన్ మరియు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దిశానిర్దేశం చేసారు. పార్లమెంట్ లో ఇప్పటికి వైసీపీ పార్టీ 11 మంది రాజ్యసభ సభ్యులతో 4గురు లోక్ సభ సభ్యులతో మొత్తం 15 మంది సభ్యుల బలంతో నిర్ణయాత్మక శక్తిగా ఉందని, ఇటీవల లోక్ సభ ఎన్నికలలో టీడీపీ 16 స్థానాలు సాధించిందని, రాజ్యసభలో ఒక్క ఎంపీ కూడా లేడని ఇది వైసీపీ సభ్యులు గమనించాలని ఆశలు కు ప్రలోభాలకు గురికాకుండా పార్టీ విలువలు కోసం ప్రజల సమస్యల ఫై మాత్రమే పోరాడాలని బీజేపీ బలం కూడా బాగా తగ్గిందని పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల ఫలితాల అనంతరం వైయస్సార్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, తద్వారా రాష్ట్రం లో హింసకు ఆజ్యం పోయడం తదితర అంశాలన్నీకూడా పార్లమెంట్ దృష్టికి తీసుకోని వెళ్లాలని కోరారు. గత గురువారం శాసనమండలి సభ్యులతో జగన్ సమావేశంలో కూడా వివిధ అంశాలపై వారితో చర్చించారు. ఇప్పటికి శాసన మండలిలో 38 స్థానాలు తో వైసీపీ అత్యధిక సభ్యులను కలిగి ఉందని ప్రభుత్వ బిల్లులు ఆమోదం లో మనది కీలక పాత్ర అని వారికీ గుర్తు చేసారు. త్వరలో మరల వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం..ప్రజలలో మరో పాదయాత్ర చేసే శక్తి తనకు ఉందని జగన్ వారికీ భరోసా ఇచ్చారు.
