సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో నేడు, మంగళవారం స్టొక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభం అయ్యింది. ఉదయం 10 గంటలకు BSE సెన్సెక్స్ 200 పాయింట్ల తగ్గిపోయి 81,596 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 76 పాయింట్లు పడిపోయి 24,869కి చేరుకుంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోగా, వీటికి విరుద్ధంగా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ మాత్రం 148 పాయింట్లు లాభపడటం విశేషం.అయితే లాభపడిన స్టాక్స్ లలో కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, NTPC, ICICI బ్యాంక్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ సంస్థలు ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే ఫార్మా సూచీ (Nifty Pharma) 0.59% నష్టపోయింది. మెటల్ సూచీ (Nifty Metal) 0.44% తగ్గింది. రియల్టీ సూచీ (Nifty Realty) 0.87% లాభపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *