సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని డి.యన్.ఆర్ కళాశాలలో నేడు, సోమవారం Volleyball Residential Camp ముగింపు కార్యక్రమం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ జి.మోజెస్ తెలిపారు. ఈ ఈ క్యాంపు మార్చి 15 నుండి జూన్ 15 వరకు జరిగిందని సుమారు 50 మందికి పైగా క్రీడా కారుల కోచింగ్ తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా కళాశాల అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోకరాజు పాండు రంగరాజు పాల్గొని క్రీడా కారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సుమారు 12 సంవత్సరాల నుండి ఈ క్యాంప్ నిర్విరామంగా జరగటం చాలా గర్వకారణంగా ఉంది అని అలాగే క్రీడాకారులకు కావలిసిన సదుపాయాలు అన్నీ మా కళాశాలలో ఉన్నాయని అలాగే ఔత్సాహిక క్రీడాకారులకు మా కళాశాలలో క్రీడా కోటాలో ఉచితంగా విద్యను అందిస్తున్నామని , ఈ క్యాంప్ ను ఆర్గనైజ్ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కె.రామకృష్ణంరాజు, సీనియర్ వాలీ బాల్ క్రీడా కారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *