సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో హోరాహోరీ యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. ట్రంప్ తన వ్యాపార దృక్పధం తాజాగా మరోసారి స్వయంగా బయట పెట్టుకొన్నారు.‘యుద్ధం రాకాసి’ దెబ్బకు ఏ దేశం అయిన సరే మనుషులు పిల్లలు చనిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జీవితాలు క్షోభ పడుతున్నాయి. వేలమంది ప్రాణాలు ఉసురు తీస్తున్న యుద్ధం ఆగవలసిందే.. అయితే10వేల మంది అమెరికా సైన్యం ను మోహరిస్తూ ఇరాన్ దేశంలో ‘అతిపెద్దది’ అయిన ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ‘ఖార్గ్’ ఐలాండ్(Kharg Island) దీపాన్ని ను స్వాధీనం చేసుకోవడం దిశగా ట్రంప్(Donald Trump) అడుగులు వేస్తున్నారు. తాజాగా ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇరాన్ చమురును తీసుకోవడం నాకు చాలా ఇష్టమైన పని. అమెరికాలోని కొందరు మూర్ఖులు నేను ఇలా ఎందుకు చేస్తున్నానని ప్రశ్నిస్తున్నారు ఇరాన్ చమురును తమ ఆధీనంలోకి తీసుకోవడమే తన ప్రాధాన్యత అని తేల్చిచెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి అక్కడి చమురు పరిశ్రమను కంట్రోల్లోకి తీసుకున్నట్లే.. ఇరాన్లో కూడా సైనిక చర్య ఉండబోతోందనే ట్రంప్ సంకేతాలిచ్చారు. అంటే ఇరాన్ అణుబాంబు తయారీ అడ్డుకోవడానికి యుద్ధం అంటూ చేసిన ప్రచారం .. చమురు కోసమే..
