సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తన ‘గొప్ప’ కోసం ట్రంప్ తీసుకొన్న అనూహ్య నిర్ణయాలు అమెరికా కు తీవ్రచేటు తెచ్చాయి. గత 7 నెలలుగా ఇరాన్‌తో సుదీర్ఘంగా జరుగుతున్నా జరిగిన యుద్ధం ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు జరిగిన ఘటనలు అమెరికా సైనిక సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు పెంటగాన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నివేదిక తాజగా ప్రకటించింది. ఈ యుద్ధంలో భారీగా ఆధునిక ఆయుధాలను వినియోగించడంతో అమెరికా వ్యూహాత్మక ఆయుధ నిల్వల్లో కొరత ఏర్పడినట్లు తెలిపింది. అంతేకాకుండా కీలక క్షిపణులు, రక్షణ వ్యవస్థలను తిరిగి సమకూర్చడంలో అమెరికా రక్షణ పరిశ్రమకు ఉత్పత్తి పరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, ఒమన్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన బికారి దాడుల ప్రభావం, దానితో అమెరికా యుద్ధ విమానాలు కు క్యాంపు బేసిన్లకు పెద్ద ఎత్తున నష్టం వచ్చినట్లు , డ్రోన్లు ధ్వంసమైనట్లు వెల్లడించింది.ఈ యుద్ధం అమెరికా ఖజానాపైనా భారీ భారాన్ని మోపింది.దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. యుద్ధానికి 37.5 బిలియన్ డాలర్లు ఖర్చయినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ జూలైలో కాంగ్రెస్‌కు తెలిపారు. మరోవైపు ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలోని అమెరికా దౌత్య కేంద్రాలకు సుమారు 184 మిలియన్ డాలర్ల భౌతిక నష్టం వాటిల్లినట్లు నివేదిక అంచనా వేసింది.. అమెరికా కోట్ల డాలర్స్ ఖర్చుతో చేసిన మిసైల్స్ ను యుద్ధ విమానాలను ఇరాన్ వేల రూపాయలు ఖరీదు అయిన డ్రోన్స్ తో నేల నాకించేస్తుంది అని, దీనితో అమెరికా కు బాగా..దిగిపోయింది అని విశ్లేషకుల అభిప్రాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *