సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 10 రోజులుగా ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల నడుమ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంతలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగడం ఇరాన్ ఫై బాంబు దాడులు చెయ్యడంతో ఇరాన్ భయపడటం మాట అటుంచి కొన్ని గంటల నుండి ప్రతీకారంతో ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది.. ఎక్కడ చుసిన మిసైల్స్ వచ్చి పడుతుండటంతో విద్వంసం జరుగుతుంది. ఎంతో మంది అమాయక ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరాన్ క్షిపణులులను అడ్డుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఇజ్రాయెల్ సైనిక దళాలు వెల్లడించాయి. కాగా, ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, జెరూసలెంతోపాటు పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ నుండి భారతీయులను రక్షించడానికి వారిని తిరిగి దేశానికీ రప్పించడానికి భారత్ తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఇరాన్ నుంచి ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) పేరుతో భారతీయులను వెనక్కి తీసుకువచ్చిన భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ కూడా విస్తరించింది.
