సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్లూరు జిల్లా కందుకూరు లో జరిగిన ఘటనకు టీడీపీ నేతల మూర్కత్వమే కారణమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనపై నేడు, గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభలకు తక్కువ స్థలం లో జనం ఎక్కువ మంది ఉన్నట్లు చూపించడానికి డ్రోన్ వీడియోలు తియ్యడానికి .. లేనిది ఉన్నట్లు చూపే ప్రయత్నం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. గతంలో సీఎం గా చంద్రబాబు ఇదే తీరు ప్రచార బాహాటం కోసం రాజమండ్రి పుష్కరాలలో 27 మందిని బలి చేసారని , అసలు చంద్రబాబు ఏం చేశారని జనం వస్తారని ప్రశ్నించారు. ఇరుకు సందులో బస్సు యాత్ర పెట్టారని, ఫెక్సీలు కట్టి మరికొంత రోడ్డు ఆవరించేశారని ఆరోపించారు. టీడీపీ ‘ఇదేం ఖర్మ .. తీరుతో 8 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి సీఎం జగన్ సర్కర్ సిద్ధంగా ఉందని.. అసలు కందుకూరులో చంద్ర బాబు సభ పక్కనే ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ ఆస్పత్రి లేకుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
