సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనాడు గ్రూప్ అధినేత చెరుకూరి రామోజీ రావు(88) నేడు, శనివారం తెల్లవారు జామున స్వర్గస్తులు కావడం ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారిని దిగ్బ్రాంతి కి గురిచేసింది. తెలుగు బాషా వికాసానికి , జర్నలిజం లో కొత్త పోకడలకు మార్గదర్శి చిట్స్ నిర్వాహకునిగా,ఈనాడు టివి ఛానల్స్ అధినేతగా సినిమాల నిర్మతగా రామోజీ ఫిల్మ్ సిటీ అధినేతగాఆయన సేవలు అపూర్వమ్. క్రమశిక్షణకు మారుపేరుగా మారిన రామోజీరావు జీవితంలో విజయాలు తో పాటు ఎన్నో వివాదాలు కూడా ఉన్నపటికీ ఆయన అంతకు మించి తెలుగు రాష్ట్రాలలో కింగ్ మేకర్ గా పేరుపొందారు. ఈ నేపథ్యంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన పార్ధివదేహాన్ని చంద్రబాబు తో పాటు రాజకీయ సినీ ప్రముఖులు పలువురు ప్రముఖులు దర్శించి ఘన నివాళ్లు అర్పించారు. రామోజీ మరణంతో అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన రామోజీ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రామోజీ రావు వ్యక్తి కాదని, శక్తివంతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు ఆయన విశిష్ట జీవన సరళి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
