సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ రైల్వే డివిజన్‌ లోని రైలుపట్టా ల ట్రాకులు మరమ్మతుల నిమిత్తం ఏలూరు, తాడేపల్లి గూడెం మీదుగా వెళ్ళే కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరి కొన్నిటిని భీమవరం మీదుగా దారి మళ్లించారు. విజయవాడ సమీపంలోని విజయవాడకు, రామవరప్పాడుకు మధ్యలో రైళ్ళ రాకపోకలు ఈనెల 13 నుంచి 19 వరకూపూర్తిగా రద్దు చేశారు. ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా వెళ్ళే రైళ్ళను కొన్ని ప్రధాన రైళ్లను భీమవరం టౌన్ స్టేషన్ మీదుగా దారి మళ్లించారు. ఇక భీమవరం మీదుగా వెళ్లే నర్సాపురం–విజయవాడ (07863), విజయవాడ – నర్సపూర్‌ రైళ్లను 13వ తేదీ నుండి 19వరకు రద్దు చేసారు. ఇక ఎర్నాకుళం జంక్షన్‌–పాట్నా (22643) ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 13న విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా వెళ్తుంది. భావనగర్‌ నుంచి కాకినాడ పోర్టుకు (12756) వెళ్ళే రైలును 18వ తేదీన విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌ నిడదవోలు మీదుగా నడుపుతారు. బెంగుళూరు నుంచి గౌహతి(12509) ఈనెల 15, 17 తేదీలలో విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌, నిడదవోలు మీదుగా నడుపు తారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్‌–భువనేశ్వర్‌ ((11019) రైలు ఈనెల 13, 15, 17, 18 తేదీలలో విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌, నిడదవోలు మీదుగా నడుపుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *