సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోనసీమ, భీమవరం ప్రాంత ప్రాంత ప్రయాణికులు విచారించవలసిన వార్త.. ఈ నెలలో బెంగుళూరు–యశ్వంత్‌పూర్‌లకు స్పెషల్ రైళ్లు ప్రకటించింది. ప్రతి శుక్రవారం బెంగుళూరు, ప్రతి ఆదివారం యశ్వంత్‌పూర్ నడిచే విధంగా షెడ్యూల్ జారీ చేసింది. అయితే ఇక్కడి ప్రయాణికుల ఆశలపై నీళ్లు చల్లుతూ..ఈ రెండు రైళ్ళను నెలాఖరులో రద్దు చేస్తున్నట్లు తాజగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలతో ఈనెల 25న నరసాపురం నుంచి యశ్వంత్‌పూర్‌కు, తిరిగి 26న యశ్వంత్‌పూర్ నుంచి నరసాపురం స్పెషల్ రైలు నడవదు. ఈనెల 23, 30 తేదీల్లో నరసాపురం నుంచి బయలు దేరాల్సిన బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ కూడా నడవవు. ఈనెల 24, జూలై 1 నుంచి బెంగుళూరు నుంచి నరసాపురం వచ్చే రైలు కూడా రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
