సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ఎన్నికలు ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో బీజేపీ పొత్తుతో అక్కడ 8 స్థానాలతో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల కోసం పవన్ ఇప్పటివరకు ప్రచారంలోకి రాకపోవడం అందరిని విస్మయపరుస్తుంది. గెలుపు ఓటములు దైవాధీనాలు .. గట్టి పోటీ ఇవ్వాలి కదా? ఇక్కడ మంచి పోటీ ఇవ్వగలిగితే..గెలుపు మజా చూపిస్తే.. ఏపీలో టీడీపీ తో పొత్తులో సీట్లు ఎక్కువ అడగవచ్చుకదా?అని తెలంగాణాలో పవన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. ఆఖరికి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈనెల 26న కూకట్‌పల్లిలో బహిరంగసభలో ఆయన పాల్గొంటారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. ఈనెల 28వ తేదీ తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మరి మిగతా 7 నియోజకవర్గాలలో పవన్ ప్రచారం ఫై మాత్రం వివరణ ఇవ్వలేదు. ఇప్పటికి వరకు బీజేపీలో కొనసాగిన వ్యాపారవేత్త ప్రస్తుత జనసేన పార్టీ అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌కి మద్ధతుగా ఐటీ ఉద్యోగులు కేపీహెచ్‌బీ(KPHB)లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నాందేడ్ల మనోహర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కూకట్‌పల్లిలో త్వరలోనే జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ గుర్తును త్వరలోనే 40వేల గాజు గ్లాసులను పంపుతామన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్‌, రాజలింగం, హరిప్రసాద్‌, కల్యాణం శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *